News September 28, 2024

అత్తపై హత్యాయత్నం.. సెంట్రల్ జైల్ వార్డెన్‌‌కు రిమాండ్

image

అత్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన కడప సెంట్రల్ జైలు వార్డెన్ మహేశ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని తుళ్లూరు సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. కాకినాడకు చెందిన హైకోర్టు ఉద్యోగి భువనేశ్వరికి మహేశ్‌తో ఏప్రిల్‌లో పెళ్లి కాగా.. వీరు గుంటూరు జిల్లా రాయపూడిలో అద్దెకుంటున్నారని చెప్పారు. ఆగస్టు 22న మహశ్ తన అత్త సాయికుమారిపై దాడి చేసి, హత్య చేసేందుకు ప్రయత్నించాడన్నారు.

Similar News

News November 14, 2025

రాజమండ్రిలో రేషన్ డీలర్‌పై కేసు నమోదు

image

రాజమండ్రిలోని నెం.39 రేషన్ షాపును ఆర్డీవో కృష్ణనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ అందుబాటు, పంపిణీ రిజిస్టర్లు, ఆన్‌లైన్ రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. స్టాక్‌కు ఆన్‌లైన్ రికార్డులకు మధ్య 360 కిలోల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత రేషన్ షాపు డీలర్‌పై నిత్యావసర సరుకుల యాక్ట్ సెక్షన్ 6A కింద కేసు నమోదు చేశారు.

News November 14, 2025

రాజమండ్రి నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు

image

అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రాజమండ్రి నుంచి శబమరిమలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సూపర్ లగ్జరీ బస్సును డీపీటీవో వై.సత్యనారాయణమూర్తి శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. తిరుపతి, కాణిపాకం, అరుణాచలం మీదుగా శబరిమలకు బస్సులు వెళ్తాయన్నారు. 5రోజులు సాగే ఈ యాత్రకు ఈనెల 15, 17వ తేదీల్లో రాజమండ్రి నుంచి వెళ్తాయని చెప్పారు. డీఎం మాధవ్, పీఆర్వో శివకుమార్ పాల్గొన్నారు.

News November 14, 2025

తూ.గో జిల్లా రాజకీయాలపై చర్చ

image

తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ పటిష్ఠతకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆ పార్టీ PAC సభ్యుడు ముద్రగడ పద్మనాభం సూచించారు. వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ తదితరులు పద్మనాభాన్ని కిర్లంపూడిలోని ఆయన నివాసంలో కలిశారు. జిల్లా రాజకీయాల గురించి సుదీర్ఘంగా చర్చించారు.