News April 17, 2024
అత్తమామల వేధింపులు.. ఇంటి ముందు మహిళ దీక్ష

అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ మండుటెండలో ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. ఈ సంఘటన బోనకల్ మండల కేంద్రంలో జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న మహిళ తన అత్తమామలు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని అంతేకాకుండా తలపై దిండుపెట్టి హత్యాయత్నం చేశారని ఆరోపిస్తూ నిరసన చేపట్టింది. న్యాయం జరగే వరకు ఇంటి ముందు నుంచి కదలనని ఆవేదన వ్యక్తం చేసింది.
Similar News
News December 4, 2025
ఖమ్మం: మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శనీయం: కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్లో గురువారం కొణిజేటి రోశయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డితో పాల్గొని చిత్రపటానికి నివాళి అర్పించారు. రోశయ్య ఆర్థిక, విద్య, వైద్య, రవాణా తదితర శాఖల్లో సేవలందించడమే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు-కర్ణాటక గవర్నర్గా పనిచేసిన మహనీయుడని కలెక్టర్ అన్నారు.
News December 4, 2025
ఖమ్మం: మొదటి విడత ఎన్నికకు 1,740 పోలింగ్ కేంద్రాలు

మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న నిర్వహించనున్నారు. ఉపసంహరణలు పూర్తి కావడంతో అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. పోలింగ్ కోసం 1,740 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,089 బ్యాలెట్ బాక్స్లు సిద్ధంగా ఉన్నాయి. 2,089 మంది పోలింగ్ ఆఫీసర్లు, 2,551 మంది ఓపీఓలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News December 4, 2025
ఖమ్మంలో 10నుంచి 12 వరకు బాలోత్సవం పోటీలు

ఖమ్మం: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మంచికంటి హాల్లో బాలోత్సవం నిర్వహించనున్నట్లు కన్వీనింగ్ కమిటీ ప్రకటించింది. బ్రోచర్లు అందని పాఠశాలలు కూడా ఈ ప్రకటనను ఆహ్వానంగా భావించి, తమ విద్యార్థులను పంపవచ్చు. సబ్-జూనియర్ల నుంచి సీనియర్ల వరకు స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, నృత్యం వంటి పలు విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఎంట్రీల కోసం 94903 00672ను సంప్రదించాలని కోరారు


