News August 31, 2024

అత్తిలిలో డెంగ్యూతో ఆరేళ్ల చిన్నారి మృతి

image

డెంగ్యూ జ్వరంతో గూన నిత్యశ్రీ పద్మ(6) శుక్రవారం రాత్రి మృతి చెందింది. అత్తిలిలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న చిన్నారికి మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో తణుకులో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. డెంగ్యూ జ్వరంగా నిర్ధారించిన వైద్యులు శుక్రవారం పరిస్థితి విషమించడంతో విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News October 20, 2025

నరసాపురంలో కూతురిపై తండ్రి అత్యాచారం

image

నరసాపురంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఎస్ఐ విజయలక్ష్మి వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఓ మహిళ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లింది. కుమార్తె(13) 9వ తరగతి చదువుతోంది. భర్త మద్యానికి బానిసయ్యాడు. జులైలో కుమార్తె(13)పై మద్యం మత్తులో తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల తల్లి గల్ఫ్ నుంచి వచ్చింది. విషయం తెలుసుకుని పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది.

News October 20, 2025

భీమవరం: నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు

image

దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 20వ తేదీ (సోమవారం) జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సోమవారం దీపావళి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్‌ కోరారు.

News October 20, 2025

పాలకోడేరు: నేడు PGRS కార్యక్రమం రద్దు

image

పాలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) దీపావళి సందర్భంగా ఈ సోమవారం రద్దు అయినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వచ్చే సోమవారం యథావిధిగా పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.