News February 10, 2025
అత్తిలి: నంది అవార్డు అందుకున్న టీచర్

అత్తిలి గ్రామానికి చెందిన తెలుగు ఉపాధ్యాయురాలు పెద్దపల్లి వెంకటరమణికి బంగారు నంది అవార్డు అందుకున్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక పురస్కారాల అకాడమీ వారు వెంకట రమణికు అవార్డును అందజేశారు. తెలుగు సాహిత్యం, కవిత్వంలో చేసిన కృషికి ఈ అవార్డు లభించినట్లు వెంకటరమణ తెలిపారు. అలాగే తెలుగు సాహిత్య, సాంస్కృతిక అకాడమీ జిల్లా అధ్యక్షురాలిగా తనను ప్రకటించినట్లు తెలిపారు.
Similar News
News April 16, 2026
టీడీపీ పదవుల్లో ‘పశ్చిమ’కు పెద్దపీట

తెలుగుదేశం పార్టీ పదవుల కేటాయింపులో ప.గో. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం దక్కింది. పార్టీ పోలిట్‌బ్యూరోలో నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, రామరాజు, ఎం.ఏ. షరీఫ్‌లకు చోటు కల్పించగా.. పీతల సుజాతకు జాతీయ స్థాయి పదవి వరించింది. అంగర రామ్మోహన్‌కు మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. సీనియర్లకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక సమతుల్యత పాటించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
News April 16, 2026
ప.గో: సహాయం చేయండి.. బహుమతి పొందండి

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునే ‘పీఎం-రాహత్’ పథకంపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. గాయపడిన వారికి రూ. 1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందని బుధవారం తెలిపారు. బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చే వారికి రూ.25 వేల నగదు పురస్కారం అందజేస్తామన్నారు. విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలని ఆమె పిలుపునిచ్చారు.
News April 15, 2026
ప.గో: నవవరుడిపై కత్తితో పీక కోసి హత్యాయత్నం

నవవరుడిపై కత్తితో పీక కోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పాలకొల్లుకు చెందిన చందక సాయికుమార్, సాయి శ్రీదుర్గలు ప్రేమించుకున్నారు. మేజర్లు కావడంతో పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇచ్చి ఈనెల 12న నరసాపురంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత పెద్దలు ఒప్పుకోవడంతో ఈనెల14న వధువు ఇంటికి దంపతులు వెళ్లారు. శ్రీను అనే వ్యక్తి వరుడిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. పోలీసలు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


