News December 11, 2024

అత్తిలి: ‘మా అమ్మను బాగా చూసుకుంటాం’

image

అత్తిలి మండలం తిరుపతిపురం పంచాయతీ పరిధి శివపురానికి చెందిన సర్రమ్మ అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే వృద్ధాప్యంలో తోడుగా ఉండవలసిన కుమారులు పట్టించుకోవడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే మండల మెజిస్ట్రేట్ వంశీ ముందు మంగళవారం హాజరు పరచగా.. తనదైన శైలిలో కొడుకులు ఇద్దరికీ తహశీల్దార్ కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం అమ్మను బాగా చూసుకుంటామని కొడుకులు ఇద్దరు షూరిటీ ఇచ్చారు.

Similar News

News December 15, 2025

ఇంధన పొదుపు.. భవితకు మదుపు: కలెక్టర్

image

ఇంధ‌నాన్ని పొదుపు చేయ‌డం ద్వారా భావిత‌రాల‌కు వెలుగు నిద్దామ‌ని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా సోమవారం భీమవరం ప్రకాశం చౌక్‌లో విద్యుత్ ఉద్యోగులతో చేపట్టిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ప్రస్తుతం మనం విద్యుత్ వృథా చేస్తే భవిష్యత్ తరాలకు అంధకారాన్ని మిగిల్చిన వారమవుతామన్నారు. ఇంధన ప్రాముఖ్యతను ఆదా చేయాల్సిన విధానాలను కలెక్టర్ నాగరాణి వివరించారు.

News December 15, 2025

ప.గో: రెండేళ్లకే ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’

image

వయసుకు మించిన జ్ఞాపకశక్తితో తణుకు మండలం ముద్దాపురానికి చెందిన రెండేళ్ల చిన్నారి కొయ్యలమూడి బృహతి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. మహాభారతం, వినాయకుని చరిత్ర వంటి ఇతిహాసాలను, ఆధ్యాత్మిక విషయాలను ఈ చిన్నారి అనర్గళంగా చెబుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. కుమార్తె ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు గోవర్ధన్, అనూష ఆమెను ప్రోత్సహించడంతో ఈ అరుదైన ఘనత సాధ్యమైంది.

News December 15, 2025

సాఫ్ట్‌బాల్ బాలికల టైటిల్ విజయనగరానికే

image

రాష్ట్రస్థాయి అండర్-17 స్కూల్ గేమ్స్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో విజయనగరం జట్టు బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు నిలిచాయి. పోటీలు ముగిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్‌బాల్ జట్టును ఎంపిక చేసినట్లు ఆర్గనైజింగ్ కార్యదర్శులు పీఎస్‌ఎన్ మల్లేశ్వరరావు, దాసరి దుర్గ ఆదివారం ప్రకటించారు.