News April 25, 2024

అత్యంత ఎత్తైన ప్రదేశానికి దేవరకొండ వాసి 

image

దేవరకొండకి చెందిన అజీజ్ అత్యంత ఎత్తైన (11,649 ఫీట్ల) ప్రదేశం”జోజి లా పాస్ “కు చేరుకున్నాడు. ఇక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని జీరో పాయింట్ అని కూడా పిలుస్తారు. దేవరకొండ నుంచి బైక్‌పై ఆరు రోజుల్లో అక్కడికి వెళ్లిన అజీజ్ పర్వతాన్ని అధిరోహించాడు.  అజీజ్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు. 

Similar News

News September 30, 2024

NLG: కాసేపట్లో రిజల్ట్స్.. పోటీ ఇలా..

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
NLG 3187 373 1:08
SRPT 2981 213 1:13
యాదాద్రి 742 135 1:05

News September 30, 2024

NLG: దసరాకు వినూత్నమైన ఆఫర్

image

తెలంగాణలో అతిపెద్ద పండగ ‘దసరా’. ఈ పండుగకు వస్త్ర, నగల వ్యాపార సంస్థలు భారీగా ఆఫర్లను పెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. NLG జిల్లాలోని శాలిగౌరారం మండలం పెర్కకొండారంలో యువకులు వినూత్నంగా ‘రూ. 200 కొట్టు మేకను పట్టు’ అనే ఆఫర్ పెట్టారు. ఈ కూపన్ ఆఫర్‌లో మేక, నాటు కోళ్లు, మందు బాటిళ్లు గెలిచిన వారికి బహుమతిగా ప్రకటించారు. విషయం తమ దృష్టికి వచ్చిందని కౌన్సెలింగ్ ఇస్తామని ఎస్సై సైదులు తెలిపారు.

News September 30, 2024

NLG: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు

image

NLG- KMM- WGL టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ నవంబర్ 6వ తేదీ వరకు కొనసాగనుందని అధికారులు తెలిపారు. నవంబర్ 23వ తేదీన ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటిస్తామన్నారు. అభ్యంతరాలు స్వీకరించి ఆ తర్వాత డిసెంబర్ 30వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నట్లు చెప్పారు.