News March 4, 2025

అత్యంత పేదరిక జిల్లాల్లో ప్రకాశం జిల్లాకు 4వ స్థానం

image

సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లాల లిస్ట్‌లో ప్రకాశం జిల్లా 4వ స్థానంలో ఉంది. ఈ జిల్లా హెడ్‌కౌంట్ రేషియో 6.28%గా ఉండగా.. తీవ్రత విషయంలో 43.60%గా ఉంది. MPB స్కోర్ యాత్రం 0.027గా ఉంది. అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాల్లో ఉమ్మడి ప.గో జిల్లా మొదట ఉంది. ఆ తర్వాత గుంటూరు, కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, తూ.గో, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి.

Similar News

News April 23, 2025

పోలీస్ ఉద్యోగం గొప్ప అవకాశం: ప్రకాశం ఎస్పీ

image

బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీసుశాఖ ప్రతిష్ఠ మరిం‌త పెంచాలని ఎస్పీ దామోదర్ సూచించారు. ఒంగోలులోని‌ జిల్లా పోలీస్ కార్యాలయంలో ముగ్గురు కానిస్టేబుళ్లకు ఆయన మంగళవారం‌ నియామక‌పత్రాలు అందజేశారు. పోలీస్ శాఖలో చేరడం గొప్ప అవకాశమన్నారు. ప్రజల భద్రతను కాపాడటం, శాంతిభద్రతలను పరిరక్షించడం ముఖ్య కర్తవ్యమని‌ సూచించారు.

News April 23, 2025

FLASH: ఒంగోలు మాజీ MLAకు గుండెపోటు

image

ఒంగోలులో నిన్న రాత్రి టీడీపీ నేత, నాగులుప్పలపాడు మాజీ MPP ముప్పవరపు వీరయ్య చౌదరిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఒంగోలు మాజీ MLA ఈదర హరిబాబుకు వీరయ్య చౌదరి మేనల్లుడు అవుతాడు. అల్లుడి మృతి వార్తతో హరిబాబు గుండెపోటుకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మంత్రులు గొట్టిపాటి, స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల, విజయ్ కుమార్, ఉగ్ర నరసింహ రెడ్డి తదితరులు హరిబాబును పరామర్శించారు.

News April 23, 2025

ప్రకాశం జిల్లా 10వ తరగతి పరీక్షల సమాచారం

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో 29,602 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగాయి.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

error: Content is protected !!