News March 4, 2025
అత్యంత పేదరిక జిల్లాల్లో ప్రకాశం జిల్లాకు 4వ స్థానం

సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లాల లిస్ట్‌లో ప్రకాశం జిల్లా 4వ స్థానంలో ఉంది. ఈ జిల్లా హెడ్‌కౌంట్ రేషియో 6.28%గా ఉండగా.. తీవ్రత విషయంలో 43.60%గా ఉంది. MPB స్కోర్ యాత్రం 0.027గా ఉంది. అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాల్లో ఉమ్మడి ప.గో జిల్లా మొదట ఉంది. ఆ తర్వాత గుంటూరు, కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, తూ.గో, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి.
Similar News
News March 19, 2025
పోతురాజు కాలువ పనుల్లో అవినీతి: MLA దామచర్ల

ఒంగోలులో ఉన్న పోతురాజు కాలువ, నల్ల కాలువ సమస్యలపైన గతంలో పోతురాజు కాలువలో జరిగిన అవినీతిని, అసెంబ్లీలో MLA దామచర్ల జనార్దన్‌రావు ప్రశ్నించారు. మున్సిపల్ మంత్రి నారాయణ సమాధానం ఇస్తూ.. పోతురాజు కాలువ ఆధునీకరణలో అవినీతి జరిగిందని MLA సభ దృష్టికి దృష్టికి తెచ్చారని తెలిపారు. దీనిపై ఇరిగేషన్ శాఖ నుంచి పూర్తి సమాచారాన్ని తీసుకొని అవినీతి చేసిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
News March 19, 2025
క్రికెట్ పోటీల్లో గాయపడ్డ MLA విజయ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రికెట్ పోటీలలో సంతనూతలపాడు ఎమ్మెల్యే BN విజయ్ కుమార్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా క్రింద పడిపోవడంతో గాయాలపాలయ్యారు. వెంటనే ఎమ్మెల్యేకు చికిత్స అందజేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 19, 2025
ఒంగోలు: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక విద్య అందడమే లక్ష్యంతో పనిచేస్తున్నదని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ విద్యా శాఖాధికారులతో సమావేశమై G.O 117, డ్రాప్ అవుట్స్ తదితర అంశాలపై సమీక్షించి, పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జీవో 117ను ఉపసంహరించిన తర్వాత ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రక్రియను విద్యాశాఖ ప్రారంభించిందన్నారు.