News February 12, 2025
అత్యధికంగా మంగపేట.. అత్యల్పంగా కన్నాయిగూడెం

ములుగు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 87 ఎంపీటీసీ, 10 జీడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి కోసం ములుగు మండలంలో 73 పోలింగ్ కేంద్రాలు, మల్లంపల్లిలో 25, వెంకటాపూర్-58, గోవిందరావుపేట-64, తాడ్వాయి-38, ఏటూరునాగారం-41, మంగపేట-77, వాజేడు-41, కన్నాయిగూడెం-21, వెంకటాపురం-54, ములుగు మండలంలో 73 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి.
Similar News
News November 27, 2025
ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: కలెక్టర్

ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పౌరసరఫరాల అధికారులకు సూచించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ధాన్యం సేకరణ, గోనెసంచులు తదితర అంశాలపై సీఎస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News November 27, 2025
ములుగు: పోలీస్ సిబ్బందికి రైయిన్ కోట్లు పంపిణీ

ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ సిబ్బందికి రైయిన్ కోట్లను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన రెయిన్ కోట్లు, టీ షర్ట్లను పంపిణీ చేశామని, పోలీసులు కాలం, సమయంతో సంబంధం లేకుండా 24 గంటలు విధి నిర్వహణలో ఉంటారని, అలాంటి వారికి కాలానుగుణంగా ఇవి తోడ్పడతాయన్నారు.
News November 27, 2025
బీసీలు కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి: KTR

TG: బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కేవలం 17 శాతమే ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలు కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్నారు. CM రేవంత్ రాజకీయ నాయకుడిలా కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని.. హిల్ట్ పాలసీ పేరుతో 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు.


