News August 21, 2024
అత్యవసరమైతే 1930, 100కు డయల్ చేయండి: ఎస్పీ జానకి

జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని MBNR జిల్లా ఎస్పీ జానకి హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో షీ టీమ్స్ పనిచేసే విధానాన్ని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈవ్ టీజింగ్, మహిళల అక్రమ రవాణ, పోక్సో చట్టం, అనేక సమస్యల పరిష్కారంకు షీ టీం బృందం సహాయం చేస్తుందన్నారు. అత్యవసర సమయంలో 1930, 100 కు డయల్ చేయాలన్నారు.
Similar News
News October 14, 2025
ఈ నెల 16న PU 4వ స్నాతకోత్సవ వేడుకలు

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో 4వ స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం పాలమూరు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ రానున్నారన్నారు. ఈ వేడుకల్లో 12 పీహెచ్డీలు, బంగారు పతకాలు ప్రదానం ఉంటుందన్నారు.
News October 13, 2025
MBNR: జాగ్రత్త.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మంగళవారం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వానలు పడవచ్చని పేర్కొంది. ఇప్పటికే చెరువులు, కుంటలు నిండి అలుగు పారాయి. ఆయా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News October 13, 2025
MBNR ఇంటర్ విద్యార్థి సూసైడ్

మహబూబ్ నగర్ మండలంలోని రామ్ రెడ్డి కూడా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి ప్రియాంక (16) బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక స్వస్థలం గద్వాల జిల్లా మల్దకల్. తనకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదని తల్లిదండ్రులకు చెప్పగా.. సోమవారం వస్తామని చెప్పగా అంతలోనే ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు విలపించారు. చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.