News March 18, 2025

అత్యాచారం కేసులో పేరుసోమల వ్యక్తికి జీవిత ఖైదు

image

అత్యాచారం కేసులో నంద్యాల జిల్లా వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష పడింది. సంజామల మండలం పేరుసోమలకు చెందిన ఉప్పు నాగహరికృష్ణ 2020లో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాకు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. విచారణలో నేరం రుజువు కావడంతో హరికృష్ణకు జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ కర్నూలు జిల్లా మహిళా కోర్టు జడ్జి వి.లక్ష్మీరాజ్యం తీర్పు చెప్పారు.

Similar News

News December 5, 2025

HYD: పునర్విభజనపై అభిప్రాయానికి సిద్ధమా?

image

గ్రేటర్‌లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు విలీనం చేయడంతో ఇపుడు అధికారులు వార్డుల పునర్విభజనపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయాలను సేకరించనున్నారు. 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోనున్నారు. ఇందుకు వారం గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత పది రోజుల్లోపు డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిచేస్తారు. అప్పుడే అసలు ఎన్ని వార్డులు వచ్చే అవకాశముందనే విషయంపై క్లారిటీ వస్తుంది.

News December 5, 2025

HYD: ‘మెట్రో’ భూములు ఏమయ్యాయి?

image

మెట్రో రైలు నిర్మాణంలో భాగంగా గత ప్రభుత్వం మెట్రోకు 57 ఎకరాలను కేటాయించింది. మెట్రో అధికారులు మాత్రం కేవలం 18 ఎకరాలను మాత్రమే వినియోగించారు. మూసారంబాగ్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, మాదాపూర్‌లో మాత్రమే మాల్స్ కట్టి మిగతా 39 ఎకరాలను వదిలేసింది. ఇప్పుడు ఈ స్థలాలను ఆడిటింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. అసలు ఆ భూములు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? ఎందుకు వాటిని వాడుకోలేదని తెలుసుకునే పనిలో పడ్డారు.

News December 5, 2025

HYD: ఇదేం పునర్విభజన.. మేం ఉండలేం బాబోయ్!

image

మా ప్రాంతాలను గ్రేటర్‌లో కలిపితే మాకు అనుకూలంగా ఉండాలి కాని.. ఎక్కడో దూరంగా ఉన్న సర్కిళ్లలో కలిపితే ఎలా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలీనంలో భాగంగా బడంగ్‌పేట, తుర్కయాంజల్, ఆదిభట్ల ప్రాంతాలు చార్మినార్ జోన్ కలిశాయి. అయితే ఆయా ప్రాంతాల వారు మాత్రం.. మేము ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఉంటామని చెబుతున్నారు. అలాగే పోచారం, బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంత వాసులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.