News April 28, 2024
అథ్లెటిక్స్ పోటీల్లో నారాయణపేట క్రీడాకారుల సత్తా

సూర్యాపేటలో నేడు జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో నారాయణపేట జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు సత్తాచాటారు. మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రన్ చాంపియన్ షిప్ అండర్-14 విభాగంలో 600 మీటర్ల పరుగు పందెంలో బసంత్ బంగారు పథకం సాధించగా, ఉమెన్స్ విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో శ్రీలత కాంస్య పతకం సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. దీంతో వారికి అభినందనలు వెల్లువెత్తాయి.
Similar News
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ RESULTS.. MBNRకు 17th Rank

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. MBNR(D)లో రెగ్యులర్ విద్యార్థులు 8,116 మంది పరీక్షలు రాయగా 5,896 మంది పాసై 72.65%తో స్టేట్‌లో 17వ ర్యాంకు సాధించింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1,740 మందికి 1,432మంది పాసై 82.30%తో 6వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 1,049 మందికి 364 మంది పాసై 34.70%తో 11వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 110 మందికి 54 మంది పాసై 49.09%తో 21వ ప్లేస్ వచ్చింది.

MBNR: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. ర్యాంక్ ఎంతంటే.!

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 8982 రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు పరీక్ష రాయగా 5586 మంది పాసయ్యారు. 62.19 శాతం రాగా, పాలమూరు జిల్లా స్టేట్‌లో 16వ స్థానంలో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 1877 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1244 మంది పాసయ్యారు. 66.28 శాతంతో స్టేట్‌లో 10వ స్థానంలో నిలిచింది.