News March 6, 2025
అదనపు వసూళ్లు చేస్తే చర్యలు తప్పవు: జేసీ

గ్యాస్ డెలివరీ ఛార్జీల పేరిట అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ ఫర్మాధ్ అహ్మద్ ఖాన్ హెచ్చరించారు. ఇటీవల పొందూరు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ మీద వచ్చిన ఫిర్యాదుల మేరకు పొందూరు పట్టణంలో గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్స్‌ను జేసీ బుధవారం విచారించారు. అదనపు ఛార్జీలు వసూలు చేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.
Similar News
News March 6, 2025
SKLM: పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యం

పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం (పి-4) సర్వేకు కార్యాచరణ రూపొందించిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌ను ఉపయోగించి ఈ నెల 8వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే ప్రారంభించి 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
News March 6, 2025
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలలో 815 మంది గైర్హాజర్

శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలలో భాగంగా
గురువారం పరీక్షకు 815 మంది గైర్హాజరయ్యారని ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు తెలిపారు. జనరల్‌లో 21156 మంది, ఒకేషనల్‌లో 1342 మంది పరీక్షల్లో హాజరు కావలసి ఉందని వివరించారు. మొత్తంగా 22498 మందికి గాను 21683 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.
News March 6, 2025
శ్రీకాకుళం: 18 షాపులు కేటాయింపు

పారదర్శకంగా లాటరీ పద్ధతిలో 18 బ్రాందీ షాపులు కేటాయించినట్లు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. గురువారం శ్రీకాకుళం అంబేడ్కర్ ఆడిటోరియంలో లాటరీ పద్ధతిలో గీత కార్మికులకు, సొండి కులస్థులు సమర్పించిన ధ్రువపత్రాల ప్రకారం ఆయా కేటగిరిలో కేటాయించామన్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి నాయుడు, అధికారులు పాల్గొన్నారు.