News December 18, 2024
అదిలాబాద్: కేంద్రమంత్రిని కలిసిన అదిలాబాద్ ఎంపీ

ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఇవాళ క్రీడా శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియాని కలిశారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో క్రీడా అభివృద్ధికి తోడ్పడాలని ఎంపీ కోరారు. అలాగే హాకీ కోర్టుకు సింథటిక్ టార్ప్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్రమంత్రికి నగేష్ వినతి పత్రం అందజేశారు.
Similar News
News February 23, 2026
తలమడుగు: రూ 2,25,000 పలికిన లడ్డు

తలమడుగు మండలం బరంపూర్ కొండ పైన గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన ‘అన్నమయ్య లడ్డు’ వేలం పాట భక్తుల మధ్య ఉత్సాహంగా సాగింది. గ్రామానికి చెందిన ఎల్టీ గోవర్ధన్ రెడ్డి ₹2,25000 చెల్లించి ఈ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. స్వామివారి కృపతో లడ్డు దక్కడం తన అదృష్టమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
News February 22, 2026
కేటీఆర్ ఆదిలాబాద్ పర్యటన వాయిదా

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా పర్యటన వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల సోమవారం రావాల్సిన ఆయన, ఈ నెల 24 (మంగళవారం) జిల్లాకు రానున్నట్లు బోథ్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రకటించింది. షెడ్యూల్‌లో జరిగిన ఈ మార్పును పార్టీ శ్రేణులు, కార్యకర్తలు గమనించాలని కోరారు. మంగళవారం జరిగే పర్యటనను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.
News February 22, 2026
రేపు ఆదిలాబాద్‌కు కేటీఆర్.. బాల్క సుమన్‌తో భేటీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఆదిలాబాద్ జిల్లాకు రానున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇటీవల అరెస్టయి ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ను ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని జోగు రామన్న పిలుపునిచ్చారు. జైలు వద్ద కేటీఆర్ పార్టీ శ్రేణులతో మాట్లాడే అవకాశం ఉంది.


