News April 29, 2024

అద్దంకిలో కరణం వర్గీయుల దారెటు?

image

అద్దంకి మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా గట్టి పట్టు ఉన్న నేత, అన్ని మండలాలలో ఆయనకంటూ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మేదరమెట్ల గ్రామం లాంటి మేజర్ పంచాయతీలలో, ఆయనకు కుడి భుజంగా మెలిగే అనుచరవర్గం ఉంది. కరణం టీడీపీని వీడి వైసీపీలో కొనసాగుతూ ఉండటంతో.. అద్దంకిలో ఆయన వర్గీయులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారని నియోజకవర్గవ్యాప్తంగా ఆసక్తికర చర్చ నెలకొంది.

Similar News

News April 15, 2026

ప్రకాశం: నేడు ఫలితాలు.. మార్కులే జీవితం కాదు.. బ్రో

image

ప్రకాశం జిల్లాలో ఇంటర్-1, సెకండియర్ విద్యార్థులు 55,500 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల సమయంలో కొందరు విద్యార్థులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయినా అది జీవితానికి ముగింపు కాదని, ఓటమి అనేది విజయానికి తొలి మెట్టని అధికారులు సూచిస్తున్నారు. <<19635802>>తల్లిదండ్రులు<<>>, ఉపాధ్యాయులు పిల్లలకు మానసికంగా అండగా నిలవాలని, అవసరమైతే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిపుణులు తెలిపారు.

News April 15, 2026

మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలు

image

మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా కలెక్టర్ విజయ సునీత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఫైర్ ఎక్యూప్మెంట్ స్టాల్‌ను, పాంప్లెట్లు, పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ ఆర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News April 14, 2026

ప్రకాశం: రేపే ఇంటర్ ఫలితాలు.. 55,500 మంది వెయిటింగ్..!

image

ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 28,500 మంది, ద్వితీయ సంవత్సరంలో 27,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.