News June 4, 2024
అద్దంకిలో గెలిచిన గొట్టిపాటి రవి

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10 స్థానాల్లో ఫలితాలు తేలాయి. ఇక మిగిలింది దర్శి, అద్దంకి స్థానాలే. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ 22 వేల పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి అయిన హనిమిరెడ్డి ఓటమి పాలయ్యారు. దీంతో జిల్లాలో టీడీపీ మరో స్థానాన్ని కైవసం చేసుకుంది.
Similar News
News November 24, 2025
ఒంగోలు: విచారణకు తీసుకొస్తే.. పారిపోయారు?

ఒంగోలులో పోలీసుల విచారణకు వచ్చిన ఇద్దరు అనుమానితులు పోలీస్ స్టేషన్ నుంచి పరారైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒంగోలులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్కు ఒంగోలుకు చెందిన ఇద్దరు అనుమానితులను తీసుకువచ్చి చోరీలపై పోలీసులు విచారించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే పోలీసుల కళ్లుగప్పి ఆ ఇద్దరు పరారైనట్లు సమాచారం. దీనితో పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
News November 24, 2025
ఒంగోలు: క్రికెట్ తెచ్చిన కుంపటి.. 12 మందిపై కేసు నమోదు!

ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగమూరు రోడ్డులో క్రికెట్ కారణంగా ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరువురి ఫిర్యాదు మేరకు 12 మంది పై కేసు నమోదు చేసినట్లు ఒంగోలు తాలూకా సీఐ విజయ్ కృష్ణ తెలిపారు. ఆదివారం మంగమూరు రోడ్డు సమీపంలో క్రికెట్ ఆడుతున్న రెండు బ్యాచ్లలో విభేదాలు తలెత్తి ఒక్కసారిగా ఘర్షణ పడ్డారు. దీంతో రెండు జట్లకు చెందిన 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 24, 2025
రాచర్ల: పొలంలో నీళ్లు పెడుతుండగా.. కరెంట్ షాక్కి గురై..

రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన చిట్టిబాబు చిన్న కుమారుడు రాజేశ్ విద్యుత్ షాక్కు గురై ఆదివారం మృతి చెందారు. మొక్కజొన్న పొలంలో నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.


