News April 2, 2025

అద్దంకిలో ప్రజా సమస్యలపై మంత్రి గొట్టిపాటి ఆరా

image

అద్దంకి పట్టణంలోని భవాని కూడలిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పర్చూరు నియోజకవర్గంలో సీఎం పర్యటన అనంతరం కనిగిరి వెళ్లి తిరిగి వెళ్తూ భవాని సెంటర్లో ఆగారు. అక్కడ ప్రజలతో మాటలు కలిపి సమస్యలపై ఆరా తీశారు. సీఐ సుబ్బరాజు మంత్రి భద్రతను పర్యవేక్షించారు.

Similar News

News November 9, 2025

బై పోల్.. ప్రచారానికి నేడే ఆఖరు

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార పర్వం నేటితో ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు మైకులు, ప్రచార రథాలు మూగబోనున్నాయి. ప్రచార గడువు ముగియనుండటంతో ఆయా పార్టీల నేతలు తమ ప్రత్యర్థులపై పదునైన మాటల తూటాలు సంధిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఇవాళ సా.6 నుంచి ఈ నెల 11(పోలింగ్ తేదీ) సా.6 గంటల వరకు నియోజకవర్గంలో వైన్స్ మూసివేయాలని HYD సీపీ సజ్జనార్ ఆదేశించారు.

News November 9, 2025

13 ఏళ్లుగా HYDలో వేములవాడ రాజన్న కళ్యాణం

image

ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం శనివారం HYDలోని ఎన్టీఆర్ గార్డెన్స్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా గత 13 సంవత్సరాలుగా ఏటా రాజరాజేశ్వర స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని హైదరాబాదులో ఘనంగా జరిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి కళ్యాణం కనులపండువగా సాగింది. ఆలయ ఈవో, CM పాల్గొన్నారు.

News November 9, 2025

కరీంనగర్: జాతీయ స్థాయికి ఒగ్గుడోలు విద్యార్థులు

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కళా ఉత్సవ్- 2025లో రాష్ట్రస్థాయిలో విజయం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. పదో తరగతి చదువుతున్న రోహిత్, ఆశిష్, రిత్విక్, హర్షిత్ గ్రామీణ సాంప్రదాయ ఒగ్గుడోలు కళా ప్రదర్శనలో ప్రతిభ చాటారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.