News April 2, 2025
అద్దంకిలో ప్రజా సమస్యలపై మంత్రి గొట్టిపాటి ఆరా

అద్దంకి పట్టణంలోని భవాని కూడలిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పర్చూరు నియోజకవర్గంలో సీఎం పర్యటన అనంతరం కనిగిరి వెళ్లి తిరిగి వెళ్తూ భవాని సెంటర్లో ఆగారు. అక్కడ ప్రజలతో మాటలు కలిపి సమస్యలపై ఆరా తీశారు. సీఐ సుబ్బరాజు మంత్రి భద్రతను పర్యవేక్షించారు.
Similar News
News April 18, 2025
అంబేడ్కర్ కోనసీమ: ఇక కరెంటు కట్ ఉండదు

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు ఇక కరెంటు సరఫరాలో ఎటువంటి ఇబ్బంది ఉండదని అమలాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాంబాబు శుక్రవారం తెలిపారు. 132 కేవీ లైన్‌లో ఛార్జ్ అయ్యాయన్నారు. సాధారణ స్థితి పునరుద్ధరించబడిందని చెప్పారు. ఉదయం 7.10 గంటలకు సరఫరా పునరుద్ధరించటం జరిగిందన్నారు. రెండు రోజుల నుంచి పడిన కరెంటు కష్టాలకు ఇక ఫుల్ స్టాప్ పడిందన్నారు. ఇక వినియోగదారులు నిశ్చింతగా ఉండాలని సూచించారు.
News April 18, 2025
అమరావతిలో 4 లైన్ల రోడ్లకు ప్రభుత్వం కసరత్తు

రాజధాని అమరావతిని కేంద్రంగా ఉంచుకుని గుంటూరు, బాపట్ల, నరసరావుపేటలతో పాటు సూర్యలంక తీరం వరకు రాకపోకలకు అడ్డంకులు తొలగించేందుకు రోడ్ల విస్తరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వినుకొండ-గుంటూరు, నిజాంపట్నం-గుంటూరు జాతీయ రహదారుల విస్తరణకు భూసేకరణ దశలో ఉండగా, కేంద్రం రూ.3,105.3 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే తెనాలి-నారాకోడూరు, తెనాలి-మంగళగిరి రోడ్లను నాలుగు లైన్లుగా తీర్చిదిద్దేందుకు పనులు మొదలుకానున్నాయి.
News April 18, 2025
మడకశిరలో మంత్రులతో జిల్లా కలెక్టర్ సమీక్ష

రాష్ట్ర మంత్రులు మడకశిరకు విచ్చేసిన సందర్భంగా R&B గెస్ట్ హౌస్‌లో మంత్రులు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్‌తో సమీక్ష నిర్వహించారు. మంత్రులతోపాటు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికే పార్థసారథితో కలిసి స్థానిక నేతలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. మడకశిర నియోజకవర్గంలోని స్థితిగతులు, సమస్యలపై చర్చించారు.