News June 7, 2024

అద్దంకిలో భారీ చోరీ

image

అద్దంకిలోని ఆయిల్ మిల్ రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. 30 తులాల బంగారం, రూ.2.25 లక్షలు నగదు, 3 రకాలైన డైమండ్స్‌ను దోచుకెళ్లిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బెల్లం రాజేశ్ ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటుండగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లారు. ఇంటి యజమాని తాళాలు పగలగొట్టి ఉండటం చూసి రాజేశ్‌కి సమాచారమిచ్చారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 30, 2025

31న ఒంగోలులో జాబ్ మేళా.. జీతం రూ.23 వేలు

image

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 31వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం ప్రకటన విడుదల చేశారు. పెద్ద స్థాయిలో కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, 10 నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన వారికి రూ.14 వేల నుంచి రూ.23 వేల వరకు జీతం లభించే అవకాశం ఉందని, 18 నుంచి 30 ఏళ్ల వయసు కలవారు పాల్గొనాలని సూచించారు.

News October 30, 2025

కురిచేడు: వాగులో చిక్కుకున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు

image

పొంగిన వాగులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిక్కుకుంది. ఈ ఘటన కురిచేడు మండలం వెంగాయపాలెం గ్రామం వద్ద చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తున్న సమయంలో గుండ్లకమ్మ వాగు ఒక్కసారిగా తన విశ్వరూపం చూపటంతో ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు ట్రాక్టర్, తాళ్ల సహాయంతో బస్సును బయటికి తీసి ప్రయాణికులను కాపాడారు.

News October 30, 2025

వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్న అరెస్ట్..!

image

టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో ఒంగోలు మాజీ ఎంపీ, మాజీ TTD చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్నను నిన్న రాత్రి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న బోలెబాబా డెయిరీ వేరొక డెయిరీని ముందు పెట్టి.. కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయం తెలిసినా కమీషన్ల కోసం అంతా సైలెంట్ అయ్యారనే ఆరోపణలపైనా సిట్ విచారణ సాగిస్తుంది. ఈ క్రమంలో అప్పన్నను అరెస్ట్ చేశారు.