News June 2, 2024

అద్దంకిలో మహిళ ఆత్మహత్యాయత్నం

image

అద్దంకి పట్టణంలో ఆదివారం మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఏల్చూరు గ్రామానికి చెందిన కుంచాల మంజుల అనే మహిళ కొంతకాలంగా అద్దంకిలో ఉంటున్నారు. అయితే ఆమె కుటుంబ కలహాల నేపథ్యంలో పట్టణంలో జ్యూస్ సెంటర్ వద్దకు వచ్చి ఆపిల్ జ్యూస్‌లో వాస్మాయిల్ కలుపుకొని తాగింది. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఆమెను హుటా హుటిన అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు.

Similar News

News September 17, 2024

ప్రకాశం: ఇవాళ్టి నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు

image

జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్‌ 2వ వరకూ స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ తమీమ్ అన్సారియా తెలిపారు. అక్టోబర్‌ 2న స్వచ్ఛ భారత్‌ దివస్‌ జరపనున్నట్లు తెలిపారు. స్వభావ్‌ స్వచ్ఛత – సంస్కార్‌ స్వచ్ఛత నినాదంతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చెప్పారు.

News September 16, 2024

స్టేట్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌గా ఏల్చూరు మహిళ

image

ఈ నెల 14, 15వ తేదీలలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన 11వ ఏపీ అన్ ఎక్యూపుడ్ పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహించారు. ఈ పవర్ లిఫ్టింగ్ పోటీలలో సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన కుమారి నంద పాల్గొని 2 పతకాలు సాధించారు. ఈమెను పలువురు అభినందించారు.

News September 16, 2024

ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీలు

image

ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. జిల్లాలోని 13 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ దామోదర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని ఎస్పీ దామోదర్ చెప్పారు. డిస్ట్రిక్ట్ వీఆర్‌లో ఉన్న కొందరికి వివిధ మండలాల్లో పోస్టింగ్లు ఇవ్వగా, మరికొందరిని వీఆర్‌‌కు బదిలీ చేశారు.