News June 23, 2024

అద్దంకిలో 33 మందిపై కేసు నమోదు

image

అద్దంకి మండలంలో శనివారం 33 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తిమ్మాయపాలెం పొలాల్లో కొందరు శుక్రవారం రాత్రి మద్యం తాగుతుండగా ప్రత్యర్థి వర్గీయులు వారిపై కర్రలు, రాడ్లతో దాడిచేసి గాయపరిచారు. క్షతగాత్రుడు ఎం.శివకృష్ణ ఫిర్యాదు మేరకు 33 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Similar News

News November 24, 2025

రాచర్ల: పొలంలో నీళ్లు పెడుతుండగా.. కరెంట్ షాక్‌కి గురై..

image

రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన చిట్టిబాబు చిన్న కుమారుడు రాజేశ్ విద్యుత్ షాక్‌కు గురై ఆదివారం మృతి చెందారు. మొక్కజొన్న పొలంలో నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

News November 24, 2025

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

image

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ నియమించబడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిసెంబర్ రెండు వరకు సెలవుల్లో ఉండడంతో, ప్రభుత్వం ఈ మేరకు బాపట్ల ఎస్పీని ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. దీనితో జిల్లా బాధ్యతలను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చేపట్టారు. డిసెంబర్ మూడో తేదీన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మళ్లీ విధుల్లో చేరనున్నారు.