News October 11, 2024

అద్దంకి: అమ్మవారికి 50 కిలోల లడ్డు సమర్పణ

image

అద్దంకి పట్టణంలో వేంచేసియున్న శ్రీ చక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు నవరాత్రులలో భాగంగా ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి దేవస్థానం 53వ దసరా నవరాత్రులు సందర్భంగా.. 53 కిలోల లడ్డూను అద్దంకి పట్టణానికి చెందిన భక్తులు వూటుకూరి సుబ్బరామయ్య, వారి సోదరులు గురువారం అమ్మవారికి సమర్పించారు.

Similar News

News November 13, 2024

ప్రకాశం: ‘పోలీసు శాఖ ప్రతిష్ఠ పెంచేలా ఉండాలి’

image

పోలీస్ ప్రతిష్ఠ మరింత పెంచేందుకు సాయుధ బలగాల పనితీరు బాగుండాలని ఎస్పీ దామోదర్ చెప్పారు. ఏఆర్ సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో మంగళవారం దర్బార్ కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాజువల్ లీవు, ట్రాన్స్ఫర్స్, టిఏలు, అలవెన్సులు, ఏఆర్, స్పెషల్ పార్టీ పోలీసుల బందోబస్తులు, జీపీఎఫ్ లోన్, మెడికల్ బిల్లులు, సీనియారిటీ లిస్టు తదితర సమస్యల గురించి చర్చించారు.

News November 13, 2024

ఒంగోలు: యువతిని గర్భవతిని చేసిన మామ

image

తండ్రిలేని యువతిని ఒంగోలుకు చెందిన మేనమామ గర్భవతిని చేసిన ఘటన ఇది. పోలీసుల వివరాల ప్రకారం.. భట్టిప్రోలుకి చెందిన 18ఏళ్ల యువతి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఆ యువతి ఆదిలాబాద్‌లో ఉంటున్న పెద్ద మేనమామ వద్ద ఉంటోంది. ఒంగోలులో ఉంటున్న చిన్న మేనమామ ఇటీవల ఆదిలాబాద్ వెళ్లాడు. ఈ క్రమంలో కోడలిని లొంగదీసుకొని గర్భిణిని చేశాడు. ఈ విషయంపై తెనాలి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News November 13, 2024

ఒంగోలులో ఫీల్డ్ ఎయిర్ పోర్టు.?

image

ఆంధ్రప్రదేశ్‌లో 6 ఎయిర్‌పోర్టుల ఫీజిబిలిటీపై సర్వే మొదలుపెట్టారు. అందులో ప్రకాశం జిల్లా ఒంగోలులో 657 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ప్రకాశం జిల్లాతో పాటు మరో 5చోట్ల ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అధ్యయనం చేయడానికి రూ.2.27 కోట్లు విడుదల చేయనున్నారు.