News June 15, 2024

అద్దంకి: టీడీపీ ఫ్లెక్సీల చించివేత

image

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖ మంత్రిగా కేబినెట్‌లో స్థానం లభించడంతో మండలంలోని మక్కెన వారి పాలెం ఎస్సీ కాలనీలో అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను శుక్రవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. దాంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News November 7, 2025

రేపు ప్రకాశం జిల్లాలో పాఠశాలలకు సెలవు రద్దు

image

మొంథా తుఫాను కారణంగా జిల్లాలో గత నెలలో ఐదు రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఇచ్చిన కారణంగా ఈనెల 8న రెండో శనివారం అన్ని యాజమాన్య పాఠశాలలు యథావిధిగా నిర్వహించాలని DEO కిరణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. 2026 మార్చి వరకు ప్రతి రెండో శనివారం పాఠశాలలను నిర్వహించాలన్నారు. పాఠశాలల సిబ్బంది నియమాలు పాటించాలన్నారు.

News November 7, 2025

ఒంగోలు: RTC బస్‌కు తప్పిన ప్రమాదం

image

ఒంగోలు సమీపంలో RTC బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి ఒంగోలు నుంచి కొండపికి ఓ బస్ బయల్దేరింది. చీమకుర్తికి వెళ్తున్న టిప్పర్‌కు పేర్నమిట్ట వద్ద ఓ గేదె అడ్డు వచ్చింది. టిప్పర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఇదే సమయంలో వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు టిప్పర్‌ను ఢీకొట్టింది. బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News November 7, 2025

వెలిగొండను ఎలా అంకితం చేశావు జగన్: నిమ్మల

image

వెలిగొండ ప్రాజెక్టు పనులు ఎక్కడివి అక్కడే ఉండిపోయాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అయినప్పటికీ ప్రాజెక్ట్ పూర్తి చేశానంటూ ఎన్నికల సమయంలో జగన్ జాతికి అంకితం ఎలా చేశారని ప్రశ్నించారు. దోర్నాల మండలంలో ప్రాజెక్టు కెనాల్, సొరంగం, తదితర అంశాలను పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట మార్కాపురం ఎమ్మెల్యే కందుల, ఎర్రగొండపాలెం ఇన్‌ఛార్జ్ ఎరిక్షన్ బాబు ఉన్నారు.