News August 11, 2024
అద్దంకి: పాత మాగులూరు వద్ద రోడ్డు ప్రమాదం

సంతమాగులూరు మండలంలోని పాత మాగులూరు వద్ద ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బల్లికురవ మండలంలోని కొప్పెరపాలెం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు ద్విచక్ర వాహనంపై నరసరావుపేట నుంచి ఇంటికి వస్తుండగా ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతడిని స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని క్షతగాత్రుడిని నరసరావుపేట వైద్యశాలకు తరలించారు.
Similar News
News February 25, 2026
మార్కాపురం జిల్లా అభివృద్ధికి CM వరాలు కురిపిస్తారా..?

మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారి CM చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో భారీగా ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లా ఏర్పాటుచేయగా వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే సీఎం జిల్లా అభివృద్ధికి ఎలాంటి వరాలు కురిపిస్తారోనని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News February 25, 2026
ఇవాళ మార్కాపురం జిల్లాకు CM.. షెడ్యూల్ ఇదే.!

CM చంద్రబాబు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పర్యటన షెడ్యూల్ CMO అధికారులు విడుదల చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12:50కి దోర్నాలలోని వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసి, పనులను పరిశీలించి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 2:30కి మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 4:40కి తిరిగి వెలగపూడికి బయలుదేరుతారు.