News October 7, 2024

అద్దంకి: ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి

image

అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ప్రజా వేదికకు తరలివచ్చిన ప్రజలతో మంత్రి మమేకమై వారి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. సత్వరమే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Similar News

News November 6, 2024

ప్రకాశం: బ్యాంకర్లతో జిల్లా అధికారుల సమీక్ష

image

అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు ఉదారతతో వ్యవహారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా, SP పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోడిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ, బ్యాంకర్స్ సమావేశం జరిగింది. జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలురకాల ఋణ లక్ష్యాలను బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు.

News November 5, 2024

పామూరు: మద్యం మత్తులో ముగ్గురిపై కత్తితో దాడి

image

మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన పామూరు మండలం నుచ్చుపొదలలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. తిరుపాల్ రెడ్డి, సురేంద్ర శనివారం మద్యం మత్తులో గొడవపడ్డారు. సురేంద్ర స్థానిక నేత రహముతుల్లా సహాయంతో తిరుపాల్ రెడ్డిని పిలిపించి పంచాయితీ పెట్టారు. ఆగ్రహంతో తిరుపాల్ రెడ్డి తన వెంట తెచ్చుకున్న కత్తితో రహముతుల్లా కుమారుడు నిజాముద్దీన్, బంధువు హజరత్, సురేంద్రలపై కత్తితో దాడి చేసినట్లు తెలిపారు.

News November 5, 2024

ప్రకాశం: నేటి నుంచి డిగ్రీ 3వ సెమిస్టర్ పరీక్షలు

image

ఆంధ్ర కేసరి యూనివర్శిటీ పరిధిలోని 88 డిగ్రీ కళాశాలలో చదువుతున్న మూడో సెమిస్టర్ విద్యార్థులకు నవంబర్ 5వ తేదీ నుంచి, 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు యూనివర్శిటీ అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ బి పద్మజ తెలిపారు. ఈ పరీక్షలకు గాను ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 88 డిగ్రీ కళాశాల నుంచి మొత్తం 6942 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు  తెలిపారు.