News April 2, 2024
అద్దంకి: బైక్‌ను ఢీకొన్న బొలెరో.. వ్యక్తి మృతి

అద్దంకిలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ముందు వెళ్తున్న ఎక్సెల్ బైక్‌ను బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అద్దంకి మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన గుదే వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం
బాడీని అద్దంకి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు.
Similar News
News January 10, 2026
ప్రకాశంలో నేడు, రేపు వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో శని, ఆదివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇటీవల జిల్లా వ్యాప్తంగా పొగమంచు అధికంగా కురుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్షసూచన ఉన్నట్లు ప్రకటన వెలువడింది.
News January 10, 2026
సెంచరీ కొట్టిన మార్కాపురం యువకుడు

కంభం జూనియర్ కాలేజీలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. మార్కాపురం ఆటగాడు అవినాష్ 58బంతుల్లో 13ఫోర్లు, ఓ సిక్సర్‌తో 104పరుగులు సాధించాడు. ముందుగా మార్కాపురం సబ్ సెంటర్, ఒంగోలు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన మార్కాపురం జట్టు 16 ఓవర్లకు 144పరుగులు సాధించింది. 125 పరుగులకే రెవెన్యూ టీమ్ ఆలౌటైంది.