News November 4, 2024
అద్దంకి: రూ.500 కోసం ఆత్మహత్య చేసుకున్నాడు

అద్దంకికి చెందిన ఇంటర్ విద్యార్థి దుర్గాప్రసాద్ (17) గుండ్లకమ్మలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా మృతికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు. ఆటోలో పండ్ల వ్యాపారం చేస్తున్న తన తండ్రి ATM నుంచి రూ. 500 బాలుడు డ్రా చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలుడుని అడుగగా మనస్తాపం చెంది, తల్లిదండ్రులను బెదిరించాలనే ఉద్దేశంతోనే గుండ్లకమ్మలో దూకి ప్రమాదవశాత్తు మృతి చెందాడని తెలిపారు.
Similar News
News December 5, 2025
ప్రకాశం: PTMకు ముస్తాబైన పాఠశాలలు

జిల్లా కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో జిల్లాలోని 2,409 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ (PTM) నిర్వహిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ తెలిపారు. పాఠశాలల్లో ఉదయం 10 గంటల నుంచి షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశాన్ని జరపాలని అన్నారు. PTM కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పాఠశాలల్లో పూర్తి చేసి, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముస్తాబు చేశారు.
News December 5, 2025
కొనకనమిట్ల : ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి!

కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చినట్లు పలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3: 30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలిపారు. ఇళ్లలోని వస్తువులు సైతం కదిలినట్లు చెప్తున్నారు. ఆ సమయంలో నిద్రలో నుంచి లేచి భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.
News December 5, 2025
MRKP: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 13న మార్కాపురం కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహంచనున్నారు. 6 మండలాల పోలీసులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బాలాజీ గురువారం సమీక్షించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా క్రిమినల్, సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, రాజీమార్గం ద్వారా పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు జాతీయలోక్ అదాలత్ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.


