News November 3, 2024
అద్దంకి: రెండో అంతస్తు నుంచి జారిపడి వ్యక్తి మృతి

అద్దంకి పట్టణంలో రంగారావు ఆసుపత్రిలో రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పవన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కింద పడి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. ఆసుపత్రిలో మరమ్మతుల నిమిత్తం కూలి పనికి వెళ్లిన అతడు ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై ఖాదర్ బాషా ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
Similar News
News November 24, 2025
ప్రకాశం: పేకాట ఆడేవారిని పట్టించిన వ్యక్తికి రూ.67వేల రివార్డ్.!

ప్రకాశం జిల్లా గిద్దలూరులో పేకాట ఆడిన ఆరుగురికి గిద్దలూరు కోర్టు న్యాయమూర్తి భరత్ చంద్ర 2రోజుల జైలు శిక్ష విధించారు. నిందితుల వద్ద నుంచి రూ.1,35,000 స్వాధీనం చేసుకున్నారు. అందులోని రూ.67,500 నగదు పేకాట ఆడుతున్నవారిని పట్టించిన వ్యక్తికి రివార్డుగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, అలా ఎవరైనా ఆడితే పోలీసులకు తెలపాలన్నారు.
News November 24, 2025
అర్జీల ఆన్లైన్లో నమోదు చేయాలి: ప్రకాశం కలెక్టర్

ఒంగోలు కలెక్టర్ రాజాబాబు కలెక్టర్ మీకోసం అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ మీకోసం అనంతరం ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ‘ప్రతి అర్జీదారుడుతో అధికారులు మర్యాదపూర్వకంగా మెలిగి వారి సమస్యను పూర్తిస్థాయిలో తెలుసుకోవాలన్నారు. ప్రతిరోజు IVRS కాల్ ద్వారా అర్జీదారులతో మాట్లాడడం జరుగుతుంది’ అని అన్నారు.
News November 24, 2025
ఒంగోలు: విచారణకు తీసుకొస్తే.. పారిపోయారు?

ఒంగోలులో పోలీసుల విచారణకు వచ్చిన ఇద్దరు అనుమానితులు పోలీస్ స్టేషన్ నుంచి పరారైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒంగోలులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్కు ఒంగోలుకు చెందిన ఇద్దరు అనుమానితులను తీసుకువచ్చి చోరీలపై పోలీసులు విచారించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే పోలీసుల కళ్లుగప్పి ఆ ఇద్దరు పరారైనట్లు సమాచారం. దీనితో పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.


