News May 5, 2024

అద్దంకి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

అద్దంకిలోని సింగరకొండ రోడ్డులో ఆదివారం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కావలికి చెందిన రాజేష్, నెల్లూరుకి చెందిన చరణ్‌లు ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వెళుతుండగా అద్దంకి దగ్గరకు వచ్చేసరికి డివైడర్‌ను ఢీ కొట్టారు. ప్రమాదంలో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందగా, చరణ్‌ను 108లో ఒంగోలు తీసుకు వెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 30, 2024

ఒంగోలు: హిజ్రాలు ఆత్మగౌరవంతో బతకాలి: ఎస్పీ

image

హిజ్రాలు ఆత్మగౌరవంతో బతకాలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. ఒంగోలులో సోమవారం హిజ్రాలు ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిజ్రాలు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష, అణచివేతలు నుంచి గర్వంగా సభ్య సమాజంలో తలెత్తుకొని బ్రతకాలని ఎస్పీ అన్నారు. హిజ్రాలు గ్రూపులుగా విడిపోయి శాంతి భద్రతల సమస్యలు సృష్టించడం, బలవంతపు వసూళ్లకు పాల్పడితే ఆత్మగౌరవం దెబ్బతింటుందన్నారు.

News September 30, 2024

చంద్రబాబు, పవన్ ముక్కు నేలకు రాయాలి: తాటిపర్తి

image

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ముక్కు నేలకు రాసి హిందువులకు క్షమాపణలు చెప్పాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. ‘తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, పవిత్రమైన వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని అవమానించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ముక్కు నేలకు రాసి హిందువులకు, రాష్ట్ర, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని Xలో పోస్ట్ చేశారు.

News September 30, 2024

ప్రకాశం: పింఛన్ల పంపిణీకి రూ.122.64 కోట్లు విడుదల

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అక్టోబర్ నెలకు సంబంధించి ప్రకాశం జిల్లాలోని 2,88,144 మంది లబ్ధిదారులకు రూ.122.64 కోట్లు విడుదలైనట్లు డీఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. 2వ తేదీ గాంధీజయంతి కావడంతో 1న పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అధికారులు బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవాలన్నారు.