News August 8, 2024
అద్దంకి వద్ద రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి
అద్దంకి పట్టణంలో గరటయ్యకాలనీ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి రేణంగివరం వైపు నుంచి అద్దంకి వస్తున్న RTC బస్సును, మార్టూరు నుంచి అద్దంకి వస్తున్న బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న బాలుడు మణికంఠ మృతి చెందగా తండ్రి రాఘవకి గాయాలయ్యాయి. వీరు మార్టూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Similar News
News September 18, 2024
అర్హులైన ప్రతి కుటుంబానికీ ఇల్లు మంజూరు: కలెక్టర్
అర్హులైన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన- 2.0 పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలో విడుదల చేశారు. ఒంగోలులోని ప్రకాశం భవనం నుంచి కలెక్టర్, లబ్ధిదారులు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల మంజురు పత్రాలను కలెక్టర్ అందజేశారు.

ప్రకాశం: ఆర్టీసీలో దరఖాస్తులకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిస్‌షిప్ చేసేందుకు ఆసక్తి గల ఐటీఐ ఉత్తీర్ణుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఒంగోలు ప్రజా రవాణా అధికారి బి.సుధాకర్‌రావు తెలిపారు. <