News February 16, 2025

అద్దంకి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

పల్నాడు జిల్లా రాజుపాలెం(M) నెమలిపురి దగ్గర అద్దంకి- నార్కెట్ పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళుతున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ నజీమా, నూరుల్లా, హబీబుల్లాగా గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News April 17, 2026

ఐ మేకప్ వేసుకుంటున్నారా?

image

కాజల్, మస్కారా, ఐలైనర్, ఐషాడోలను ప్రతిరోజూ అప్లై చేయడం వల్ల కళ్ళకు హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతే కాదు, ఇది ఎక్కువసేపు కళ్ళ పైన ఉండటం వల్ల వాటిలోని రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు కళ్ళ మెరుపును తగ్గిస్తాయంటున్నారు. అలాగే ఐ మేకప్ ప్రొడక్ట్స్ వాడే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం, వాటిని ఇతరులతో పంచుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముందంటున్నారు.

News April 17, 2026

ఏలూరు: బాలికపై లైంగిక దాడి.. 14 రోజుల రిమాండ్

image

ఏలూరు 1వ పట్టణానికి చెందిన చింటూ అనే వ్యక్తి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. అలంకరణ పనులు చేసే నిందితుడు, ఏప్రిల్ 2న బాలికను విజయవాడ తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, గురువారం నిందితుడిని అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

News April 17, 2026

అనంత: నేడు, రేపు జాగ్రత్త!

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేడు, రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తీవ్ర వడగాలులు వీస్తాయని రేకులకుంట వాతావరణ శాఖ కేంద్రం శాస్త్రవేత్త నారాయణ స్వామి తెలిపారు. ఎండలో పనిచేసే కూలీలు, బయట ఉన్నవారు అరగంటకోసారి నీడలో విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఎక్కువగా నీరు తాగాలని, వృద్ధులు, చిన్నారులు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు.