News March 19, 2025
అద్భుతం.. సుద్ద ముక్కతో మక్కా మజీద్

ప్యాపిలి మండలం వెంగళంపల్లికి చెందిన ప్రముఖ చిత్రకారుడు మధుకృష్ణ శుద్ధ ముక్కతో అద్భుతాన్ని సృష్టించాడు. మక్కా మజీద్ నమూనాను తయారు చేసి అందరినీ ఆకర్షించాడు. ప్రస్తుతం ముస్లింలకు అత్యంత పవిత్ర రంజాన్ మాసం కావడంతో ఈ నమూనాను తయారు చేసినట్లు మధుకృష్ణ వెల్లడించారు. చిత్రకారుడిని గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.
Similar News
News January 7, 2026
NZB: కవిత రాజీనామా.. ఎమ్మెల్సీ పదవికి ఉపఎన్నిక ఎప్పుడంటే..?

కవిత రాజీనామాకు ఆమోదం లభించడంతో నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్టు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఉపఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీని మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్నుకుంటారు. వారెవరూ ఇప్పుడు లేరు. ఆ ఎన్నికలు జరిగిన తర్వాత ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఉంటుంది. కవిత 2021 DECలో ఎమ్మెల్సీగా ఎన్నికై 2022 జనవరిలో ప్రమాణస్వీకారం చేశారు.
News January 7, 2026
ఎయిమ్స్ రాయ్‌బరేలిలో 103 పోస్టులకు నోటిఫికేషన్

ఎయిమ్స్ రాయ్‌బరేలి 103 Sr. రెసిడెంట్స్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి పీజీ (MD/MS/DNB/DM/M.Ch)ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గలవారు JAN 9, 23, FEB 6, 20తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.67,700+NPA చెల్లిస్తారు. షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. https://aiimsrbl.edu.in/
News January 7, 2026
VZM: తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

డెంకాడ మండల పరిధిలోని వెలంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఒనుము పాపయ్య (42) తాటి చెట్టెక్కే సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు SI సన్యాసినాయుడు మంగళవారం తెలిపారు. వెలంపేట శివారులోని తాటిపెండిలో తాటి చెట్టెక్కిన పాపయ్య అకస్మాత్తుగా కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


