News March 19, 2025
అద్భుతం.. సుద్ద ముక్కతో మక్కా మజీద్

ప్యాపిలి మండలం వెంగళంపల్లికి చెందిన ప్రముఖ చిత్రకారుడు మధుకృష్ణ శుద్ధ ముక్కతో అద్భుతాన్ని సృష్టించాడు. మక్కా మజీద్ నమూనాను తయారు చేసి అందరినీ ఆకర్షించాడు. ప్రస్తుతం ముస్లింలకు అత్యంత పవిత్ర రంజాన్ మాసం కావడంతో ఈ నమూనాను తయారు చేసినట్లు మధుకృష్ణ వెల్లడించారు. చిత్రకారుడిని గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.
Similar News
News April 18, 2025
మలికిపురం: ఆకట్టుకుంటున్న సంగీత్ శిలువ చిత్రం

మలికిపురానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఎన్ సంగీత్ కలం నుంచి జాలువారిన ఏసుక్రీస్తు శిలువ చిత్రం ఆకట్టుకుంటుంది. గుడ్ ఫ్రైడే సందర్భంగా సంగీత్ సమస్త మానవాళి పాపాల కోసం క్రీస్తు శిలువపై ప్రాణాలను త్యాగం చేసిన చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. శిలువ కాబడిన మూడో రోజున తిరిగి సమాధి నుంచి లేచి వచ్చిన దృశ్యాలను సంగీత్ సజీవంగా మలిచారు. మల్లిక్ తాను వేసిన చిత్రాలను సన్నాయి అన్న ఆర్ట్స్ అకాడమీలో ప్రదర్శించారు.
News April 18, 2025
దేశానికి ఆదర్శంగా నిలిచేలా బెట్టింగ్ వ్యతిరేక విధానం తెస్తాం: లోకేశ్

AP: బెట్టింగ్ యాప్స్‌ను నిషేధించాలని యూట్యూబర్ అన్వేష్ చేసిన ట్వీట్‌కు మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘బెట్టింగ్ యాప్‌లు జీవితాలను నాశనం చేస్తున్నాయి. జూదానికి బానిసైన వందలాది మంది హృదయ విదారక కథలను వింటున్నా. వీటిని ఆపేయాలి. నిరంతర అవగాహన, కఠినంగా వ్యవహరించడమే దీనికి దీర్ఘకాలిక పరిష్కారం. దేశానికే ఆదర్శంగా నిలిచేలా బెట్టింగ్ వ్యతిరేక విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News April 18, 2025
బెల్లంపల్లి: సమ్మర్ స్పెషల్ ట్రైన్ గడువు పొడిగింపు

ఎండా కాలం దృష్ట్యా ప్రవేశపెట్టిన సమ్మర్ స్పెషల్ ట్రైన్ దానాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు గడువును రైల్వే శాఖ మరో ఐదు రోజులు పొడిగించింది. స్పెషల్ ట్రైన్ ప్రస్తుత కాలపరిమితి ఈ నెల 17 వరకు ఉండగా.. 28 వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కాజీపేట్- బల్లార్షా సెక్షన్ పరిధిలోని కాజిపేట్, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్షా జంక్షన్‌లో ఈ రైలు ఆగుతుంది.