News September 1, 2024
‘అద్విక-24’ టెక్ ఫెస్ట్ బ్రోచర్ ఆవిష్కరించిన వీసీ

నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19, 20 తేదీలలో ‘అద్విక 24’ జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య శ్రీనివాసరావు తెలిపారు. యూనివర్సిటీలో శనివారం ఇంజినీరింగ్ ఫ్రెషర్స్ పార్టీలో ‘అద్విక-24’ జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్కు సంబంధించిన బ్రోచర్ను వీసీ ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. ఇంజినీరింగ్ తో పాటు కంప్యూటర్ కోర్సులు చేస్తున్నవారు దీనికి అర్హులన్నారు.
Similar News
News November 22, 2025
‘రైతన్న- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

ఈ నెల 24 నుంచి 29 వరకు అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో ‘రైతన్న- మీకోసం వారోత్సవాలు’ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శనివారం ఆమె వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 29 వరకు రైతుల ఇళ్లను సందర్శించాలని, ఆ సమాచారాన్ని డిసెంబర్ 2 వరకు విశ్లేషించాలని కలెక్టర్ సూచించారు. ఈ వారోత్సవాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.
News November 22, 2025
తూ.గో జిల్లాకు రాష్ట్రంలో ప్రథమ స్థానం

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు గణాంకాలలో తూర్పు గోదావరి జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం గర్వకారణమని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం పేర్కొన్నారు. 75.54 శాతం మార్కులతో జిల్లా ఈ ఘనత సాధించిందన్నారు. సేవల్లో నాణ్యత, ఆరోగ్య ప్రచార కార్యక్రమాల నిర్వహణతో ఆదర్శంగా నిలిచి రాష్ట్రంలో ప్రథమ స్థానం వచ్చినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.
News November 22, 2025
“తూర్పు”లో టెన్త్ రాయనున్న 26,619 విద్యార్థులు

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ కె.వాసుదేవరావు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి మొత్తం 26,619 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు. విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివి విజయం సాధించాలని డీఈఓ సూచించారు.


