News November 10, 2024
అధికారంలో వస్తే వారిని వదలం: కాకాణి

రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు పచ్చ చొక్కాలు తొడుక్కొని విధులు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. జగన్పై అభ్యంతరకరంగా పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు ఏవని ప్రశ్నించారు. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉందన్నారు. ఇలాగే కొనసాగితే ప్రజలే తిరగబడతారన్నారు.
Similar News
News October 23, 2025
ఊపిరి పీల్చుకున్న నెల్లూరు.. వర్షం ముప్పు తప్పునట్టేనా!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజుల నుంచి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే అందుకు భిన్నంగా నెల్లూరులో వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి నుంచి చిన్నచిన్న చినుకులు మినహా వర్షం పడలేదు. ఉదయం నుంచి ఎండ కాస్తోంది. దీంతో తుఫాను ముప్పు తప్పినట్టేనని జిల్లా వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
News October 23, 2025
ఛామదల నేరెళ్ల వాగులో పడి వ్యక్తి గల్లంతు..!

జలదంకి మండలం ఛామదల గ్రామానికి చెందిన దంపూరు మల్లికార్జున (45) చామదల గ్రామం నుంచి కావలికి వెళ్లేందుకు తన బైక్పై నేరెళ్ల వాగు దాటేందుకు ప్రయత్నించగా బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్ తోపాటు మల్లికార్జున కూడ సప్తా పై నుంచి వాగులో పడిపోయారు. విషయం తెలుసుకున్న జలదంకి తహశీల్దార్ ప్రమీల, ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా అక్కడికి చేరుకున్నారు. గ్రామస్థులతో మాట్లాడి గాలింపు చర్యలు చేపట్టారు.
News October 23, 2025
అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు : నెల్లూరు ఎస్పీ

జిల్లావ్యాప్తంగా నేటి నుంచి 25వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి వెళ్లొద్దని ఎస్పీ డా అజిత వేజెండ్ల ఒక ప్రకటనలో తెలిపారు. సముద్ర తీర పర్యాటకం నిషేధించామని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. పాత ఇళ్లల్లో జాగ్రత్తగా ఉండాలని, తడిచిన చేతులతో విద్యుత్ వస్తువులు తాకరాదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 112 నెంబర్కు కాల్ చేయాలన్నారు.