News March 5, 2025
అధికారులకు ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఆదేశాలు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వేసవిలో విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ అన్నారు. అమలాపురం భట్లపాలెం ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని విద్యుత్ శాఖ అధికారులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి సీజన్‌లో ఎక్కడ లోఓల్టేజీ సమస్య లేకుండా చూడాలని అధికారులు ఆదేశించారు. జిల్లాలో కొత్తగా ఆరు పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
Similar News
News March 21, 2025
నిమిషానికి ప్రభుత్వ అప్పు రూ.కోటి: ఏలేటి

TG: రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై ₹2.27L రుణభారం ఉందని BJP శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. TG అప్పు ₹8.6L Crకు చేరిందని ఆరోపించారు. ప్రభుత్వం నిమిషానికి ₹కోటి అప్పు చేస్తోందని, ఇలా రుణాలు పెరిగితే అభివృద్ధి ఎలా సాధ్యమని బడ్జెట్‌పై చర్చలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. UPA హయాంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 32% ఉంటే ఇప్పుడు 42% అందుతోందని, అయినా కేంద్రాన్ని విమర్శించడం సరికాదన్నారు.
News March 21, 2025
కివీస్‌పై పాకిస్థాన్ స్టన్నింగ్ విన్

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ అద్భుత విజయం సాధించింది. 205 పరుగుల టార్గెట్‌ను ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 200కుపైగా టార్గెట్‌ను అత్యంత వేగంగా ఛేదించడం ఇదే తొలిసారి. ఆ జట్టు ఓపెనర్ హసన్ నవాజ్ (105*) సెంచరీతో విధ్వంసం సృష్టించారు. 45 బంతుల్లోనే 10 ఫోర్లు, 7 సిక్సర్లతో శతకం బాదారు. కెప్టెన్ సల్మాన్ అఘా (51*) హాఫ్ సెంచరీతో రాణించారు.
News March 21, 2025
నందనవనంగా అమరావతిని మార్చుకుందాం

AP రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటోంది. దాదాపు 30 వేల ఎకరాల్లో భారీ ప్రాజెక్టుల సమాహారం ఇది. అయితే మహానగరంగా ఎదిగే ఏ ప్రాంతమైనా ఎదుర్కొనే ప్రధాన సమస్య పర్యావరణం. అందుకు ప్రభుత్వమే కాదు మనమూ నైతిక బాధ్యత వహించాలి. ప్రకృతితో స్నేహం చేస్తూ ఇంటికో చెట్టు పెంచాలి. ప్రకృతి ఒడిలో ఓలలాడేలా, పచ్చదనం విరబూసే నందనవనంలా అమరావతిని అలంకరించాలి. మీరేమంటారు.
నేడు ప్రపంచ అటవీ దినోత్సవం.