News March 6, 2025

అధికారులకు కీలక సూచనలు చేసిన ప్రకాశం కలెక్టర్

image

ఈనెల 8వ సీఎం చంద్రబాబు మార్కాపురం పర్యటన నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ తమిమ్ ఆన్సరియా కీలక సూచనలు చేశారు. కేటాయించిన విధులను తూచా తప్పకుండా పాటిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లు, వీఐపీ, జనరల్ పబ్లిక్ పార్కింగ్ ఏర్పాట్లు, స్టాల్స్ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

Similar News

News April 17, 2026

ప్రకాశం జిల్లా ప్రజలకు గమనిక

image

ప్రకాశం జిల్లాలో జనగణన-2027లో భాగంగా ‘స్వీయ గణన'(Self-Enumeration) ప్రారంభమైందని కలెక్టర్ పి. రాజాబాబు వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా ఆయన తన కుటుంబ వివరాలను నమోదు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 30వ తేదీ వరకు ప్రజలు se.census.gov.in ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. లాస్ట్‌లో వచ్చే యూనిక్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకుని.. మేలో ప్రజల వద్దకు వచ్చే అధికారులకు వాటిని చూపాలని కోరారు.

News April 17, 2026

ఒంగోలులో భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు

image

ఒంగోలు నియోజకవర్గంలో భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ పి. రాజాబాబు రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి నిర్వహించిన సమీక్షలో సమస్యల పురోగతిని పరిశీలించారు. పేదలకు ఇళ్ల పట్టాల మంజూరును వేగవంతం చేసి, గృహ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.