News February 9, 2025
అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

ఎ.కొండూరు కిడ్నీ వ్యాధుల ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యశాఖ.. వివిధ శాఖల సమన్వయంతో విస్తృత జనజాగృతి కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. శనివారం విజయవాడ కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
Similar News
News March 24, 2025
21 బంతుల్లో హాఫ్ సెంచరీ

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ వీర విహారం చేశారు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశారు. ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదారు. మరోవైపు పూరన్ సైతం ధాటిగా ఆడుతున్నారు. 7 ఓవర్లలో స్కోరు 89/1.
News March 24, 2025
PDPL: అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: అడిషనల్ కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ దాసరి వేణు సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సంబంధిత అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు.
News March 24, 2025
అనకాపల్లి: పదవ తరగతి పరీక్షకు 202 మంది విద్యార్థులు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో సోమవారం జరిగిన పదవ తరగతి గణితం పరీక్షకు 202 విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 20,774 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 20,681 హాజరైనట్లు చెప్పారు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 685 మంది హాజరు కావలసి ఉండగా 576 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.