News February 4, 2025
అధికారులకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్న అర్జీలు, రీ ఓపెన్ అర్జీలకు నాణ్యమైన పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రీ ఓపెనింగ్ ఫిర్యాదులపై జేసీ సూరజ్, డీఆర్ఓ మురళిలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో40 రీ ఓపెనింగ్ అర్జీలను వ్యక్తిగతంగా పరిశీలించారు. జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 14, 2025
బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110

బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి: బార్‌లో దాడి.. ఆరుగురికి రిమాండ్: CI

బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ఏరియాలో ఓ బార్‌లో జరిగిన గొడవలో దాడికి పాల్పడిన మరో ముగ్గురు కోట సౌషీల్, కాలం నవీన్, చింతం సాయికుమార్‌ను గురువారం రిమాండ్ తరలించినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ ఆప్టులుద్దీన్ తెలిపారు. తాండూర్ మండలానికి చెందిన బండారి వంశీని 6గురు వ్యక్తులు బీరు సీసాలతో దాడి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అల్లి సాగర్, రత్నం సోము, మామిడి అన్నమయ్యలను ఈనెల 9న అరెస్టు చేశారు.