News March 13, 2025
అధికారులకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతినెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ఈనెల 15 నిర్వహించనున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని ముందు రోజు రాత్రి ఆయా మండలాలకు వెళ్లి రాత్రి బస చేయాలన్నారు.
Similar News
News November 26, 2025
కోదాడ: రాజేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలి: మందకృష్ణ

కర్ల రాజేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో ఇటీవల మృతిచెందిన కర్ల రాజేశ్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు.
News November 26, 2025
నల్గొండ జిల్లాలో నేటి సమాచారం

మునుగోడు: పెట్రోల్ బంకుల్లో తనిఖీ
శాలిగౌరారం: వే2న్యూస్ కథనానికి స్పందన
పెద్దవూర: హైవేపై రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్
నల్గొండ: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.30 లక్షలు: మంత్రి కోమటిరెడ్డి
మిర్యాలగూడలో భారీ ర్యాలీ
నల్గొండ: సర్పంచ్ ఎన్నికల్లో వారిని దింపేందుకు ఫోకస్
నల్గొండ: పల్లెపోరుకు యంత్రాంగం రెడీ
మిర్యాలగూడ: వందే భారత్ రైలుకు అదనంగా 4 బోగీలు
కట్టంగూరు : భక్తులను ఆకట్టుకున్న మల్లన్నమర్రి
News November 26, 2025
జగిత్యాల: ‘రాజ్యాంగం ద్వారానే బలహీనవర్గాలకు సంక్షేమ ఫలాలు’

అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు అన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ‘అంబేద్కర్ సూర్యుడు’ అనే పుస్తకాన్ని అంబేడ్కర్ సేవా సభ్యులు నరేందర్, శివ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతలకు అందజేశారు.


