News February 3, 2025
అధికారులకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్న అర్జీలు, రీ ఓపెన్ అర్జీలకు నాణ్యమైన పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రీ ఓపెనింగ్ ఫిర్యాదులపై జేసీ సూరజ్, డీఆర్ఓ మురళిలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో40 రీ ఓపెనింగ్ అర్జీలను వ్యక్తిగతంగా పరిశీలించారు. జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 22, 2026
వరంగల్ మార్కెటింగ్ ఆర్జేడీ శ్రీనివాస్ బదిలీ

వరంగల్ మార్కెటింగ్ శాఖ రీజియన్ జాయింట్ డైరెక్టర్ ఉప్పుల శ్రీనివాస్ బదిలీ అయ్యారు. ఆయనను హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం అదనపు డైరెక్టర్‌గా విధుల్లో ఉన్న ఆర్. లక్ష్మణుడుకు వరంగల్ ఆర్జేడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
News January 22, 2026
CSLలో 260 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(<
News January 22, 2026
అనంత: అనుమానం.. ఇద్దరు మహిళల హత్య

అనుమానంతో ఇద్దరు మహిళలను వారి భర్తలు కిరాతకంగా హత్య చేయడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. రాయదుర్గం ముత్తరాసి కాలనీకి చెందిన కుళ్లయమ్మకు అనంతపురానికి చెందిన మారెన్నతో 25ఏళ్ల క్రితం వివాహమైంది. భర్తతో గొడవపడి ఇటీవల పుట్టింటికి వచ్చింది. భర్త మంగళవారం వచ్చి అక్కడే పడుకొని బుధవారం మచ్చుకత్తితో నరికి పరారయ్యాడు. అనంతపురంలోని ఎల్లమ్మ కాలనీలో భార్య గంగను భర్త వీరా కొడవలితో గొంతు కోసి పోలీసులకు లొంగిపోయాడు.


