News January 21, 2025
అధికారులకు ప్రకాశం కలెక్టర్ కీలక సూచనలు

రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీల పరిష్కారం, రీ సర్వేపై క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. మంగళవారం ఆయా అంశాలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సదస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిందన్నారు. ఈ సదస్సులలో వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
Similar News
News October 17, 2025
వీరయ్య చౌదరి హత్య.. జైలు నుంచి సురేశ్ విడుదల

ఒంగోలులోని తన కార్యాలయంలో ఏప్రిల్ 24న టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడు ముప్పా సురేశ్‌ను ఆగస్ట్ 19న అరెస్ట్ చేశారు. ఒంగోలు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు కోర్టు బుధవారం బెయిల్ ఇచ్చింది. ఆ పత్రాలు జైలుకు చేరడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ప్రతి ఆదివారం ఒంగోలు తాలుకా స్టేషన్‌కు హాజరు కావాలని కోర్టు షరతులు విధించింది.
News October 17, 2025
ప్రభుత్వాలు మారినా దోపిడీ ఆగడం లేదు..!

వెలిగొండ ప్రాజెక్ట్ పనులకు ప్రభుత్వం ఇటీవల రూ.456కోట్లు ఇవ్వగా త్వరలోనే R&R ప్యాకేజీ విడుదల చేయనుంది. సుంకేసుల, కలనూతల, గుండంచెర్లలోని 5వేలమందికి ఈ పరిహారం అందనుంది. ఈక్రమంలో కొందరు నాయకులు పరిహారం కావాలంటే ముందుగా రూ.20వేలు ఇవ్వాలని నిర్వాసితుల నుంచి వసూళ్లు చేస్తున్నారంట. గత ప్రభుత్వంలోనూ ఇలాగే నాయకులు దోపిడీ చేయగా కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. మిమ్మల్ని ఇప్పుడు ఎంత అడిగారో కామెంట్ చేయండి.
News October 16, 2025
ప్రకాశం జిల్లాలో 2 హైవేలు ప్రారంభం.!

కర్నూలు జీఎస్టీ సభ వేదికగా ప్రధాని మోదీ వివిధ పనులను గురువారం ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. వాటిలో ప్రకాశం జిల్లాలో (1) కనిగిరి బైపాస్ (2) సీఎస్‌పురం 2 లైన్ బైపాస్‌లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.