News March 28, 2025
అధికారులకు బాపట్ల కలెక్టర్ ఆదేశాలు

ఇసుక రీచ్‌లలో ఇసుక నిల్వల పెంపుపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఇసుక రీచ్‌లలో ఉన్న ఇసుక నిల్వలపై గనుల శాఖ అధికారులతో ఆయన ఆరా తీశారు.
Similar News
News December 13, 2025
పల్నాడు: ‘ఓవర్ లోడ్‌లు అరికట్టేందుకు చర్యలు’

పల్నాడు జిల్లాలో ఓవర్ లోడ్‌లు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్ కుమార్ తెలిపారు. ఇసుక టిప్పర్లతో పాటు భారీ వాహనాలకు సంబంధించి రూ. 20 వేల వరకు జరిమానాలు ఓవర్ లోడ్‌కు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రత్యేకంగా ఇసుక వాహనాలకు సంబంధించి 35కు పైగా కేసులు నమోదు చేశామన్నారు. పరిమితికి మించి వెళ్లే ప్రతి వాహనంపై నిఘా ఉంటుందని, నిబంధనలు పాటించాలన్నారు.
News December 13, 2025
గురుకుల స్కూళ్లలో అడ్మిషన్లు.. అప్లై చేసుకోండిలా

TG: ప్రభుత్వ రెసిడెన్షియల్ (గురుకుల) స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5-9 తరగతుల్లో అడ్మిషన్లకు ప్రభుత్వం TGCET నిర్వహించనుంది. ఈ పరీక్షకు అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 21 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22న ఎగ్జామ్ ఉంటుంది. పరీక్ష ఫలితాల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం <
News December 13, 2025
NZB: మరదలిపై అత్యాచారం చేసిన బావకు పదేళ్ల జైలు శిక్ష

మరదలిపై అత్యాచారం చేసిన బావకు నిజామాబాద్ జిల్లా మహిళా కోర్టు జడ్జి దుర్గాప్రసాద్ 10 సంవత్సరాల జైలు శిక్ష రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 2019లో సాయినాథ్ అనే వ్యక్తి భార్య ఇంటి వద్ద లేని సమయంలో NZBలో ఉండే మరదలి వద్దకు వెళ్లి మీ అక్క రమ్మంటోందని చెప్పి బైక్ పై తీసుకెళ్లి ఇంట్లో అత్యాచారం చేశాడు. సాక్షాధారాలను పరిశీలించిన జడ్జి నిందితుడికి జైలు శిక్ష ఖరారు చేశారు.


