News March 28, 2025
అధికారులకు బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాలు

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ తుషార్ డూడి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కు పాదం మోపాలని అధికారులకు సూచించారు. దొంగతనాలు, నేరాలు జరగకుండా రాత్రి వేళలో పటిష్టమైన గస్తీ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 21, 2025
రేపు ఇంటర్ రిజల్ట్స్.. మేడ్చల్‌లో వెయిటింగ్

రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన మేడ్చల్ జిల్లాలో 150 సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇంటర్ ఫస్టియర్‌లో 71,286 విద్యార్థులకు 69,842 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 63,946 విద్యార్థులకు 62,969 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం రేపు తేలనుంది. ఇంటర్ ఫలితాలను <<16170006>>Way2News<<>>లో చెక్ చేసుకోండి.
SHARE IT
News April 21, 2025
రేపు ఇంటర్ రిజల్ట్స్.. రంగారెడ్డిలో వెయిటింగ్

రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన రంగారెడ్డి జిల్లాలో 185 సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇంటర్ ఫస్టియర్‌లో 83,829 విద్యార్థులకు 81,966 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 71,684 విద్యార్థులకు 70,431 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం రేపు తేలనుంది. ఇంటర్ ఫలితాలను <<16170006>>Way2News<<>>లో చెక్ చేసుకోండి.
SHARE IT
News April 21, 2025
తిరుపతి SVU పరీక్షలు వాయిదా

తిరుపతి SVUలో ఈనెల 22, 23వ తేదీల్లో ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెండో, నాల్గో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం అధికారి దామ్లా నాయక్ వెల్లడించారు. మొదటి రెండు రోజులకు సంబంధించిన పరీక్షలను మే 12, 14 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. 24 నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.