News February 27, 2026
అధికారులకు భద్రాద్రి ‘రామయ్య’ పరీక్ష..!

భద్రాద్రి రామనవమి వేడుకలు ఈసారి జిల్లా ఉన్నతాధికారులకు సవాల్‌గా మారనున్నాయి. బాధ్యతలు చేపట్టిన తర్వాత కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్‌కు ఇదే తొలి కళ్యాణ వేడుక. వీరితో పాటు EO దామోదర్‌రావు తొలిసారిగా ఈ వేడుకలను పర్యవేక్షించనున్నారు. 2019 బ్యాచ్‌కు చెందిన కలెక్టర్ అంకిత్ ఇప్పటికే ఏర్పాట్లపై దృష్టి సారించారు. కొత్త బృందానికి కళ్యాణ నిర్వహణ తొలి అనుభవం కావడంతో జిల్లావాసుల్లో ఆసక్తి నెలకొంది.
Similar News
News April 14, 2026
విజయవాడలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. రూ. 7 లక్షలు హాంఫట్!

విజయవాడలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారుడికి ఫోన్ చేసిన దుండగులు.. అతని ఆధార్ నంబర్‌కు మానవ అక్రమ రవాణా కేసుతో సంబంధం ఉందని భయపెట్టారు. తాము పోలీసులమని నమ్మబలికి, కేసు నుంచి బయటపడాలంటే డబ్బు ఇవ్వాలని బెదిరించడంతో బాధితుడు రూ. 7 లక్షలు సమర్పించుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 14, 2026
క్రీమ్ బిస్కెట్లు తింటున్నారా?

అందరూ ఇష్టంగా తినే క్రీమ్ బిస్కెట్లు ఆరోగ్యానికి మంచివి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు బిస్కెట్లను అతికించేందుకు సింథటిక్ ఎమల్సిఫయర్స్‌ను రేప్ సీడ్ ఆయిల్‌తో కలిపి క్రీమ్‌ను తయారుచేస్తారంటున్నారు. ‘వీటిని ఎక్కువగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి డయాబెటిస్, ఫ్యాటీ లివర్, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సింథటిక్ గుండె రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt
News April 14, 2026
VZM: గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ భార్యాభర్తలు అరెస్ట్

ఒడిశా నుంచి బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను VZM 1వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.5లక్షల విలువైన 49.147 కిలోల గంజాయి, 2 సెల్‌ఫోన్లు, రూ.650 స్వాధీనం చేసుకున్నట్లు SP దామోదర్ సోమవారం తెలిపారు. కర్ణాటకకు చెందిన భార్యాభర్తలు వరుణ్‌కుమార్ మణి, నిషా బైరపురంతో సహా మరో ఇద్దరు గూడ్స్ షెడ్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది.


