News February 13, 2025

అధికారులకు GHMC కమిషనర్ కీలక ఆదేశాలు

image

GHMCలోని అడిషనల్, జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులను సందర్శకులు కలిసేందుకు సా. 4 నుంచి 5 గం.ల మధ్య కార్యాలయంలో ఉండాల్సిందేనని GHMC కమిషనర్ ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని పనిదినాల్లో ప్రజల వేదనలు వినేందుకు, వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కార్యాలయంలో ఉండాలన్నారు.ఒకవేళ ఎవరైనా అనివార్య కారణాలతో ఉండటం సాధ్యం కాకపోతే అడిషనల్ కమిషనర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News November 28, 2025

21 మందిని అరెస్టు చేసిన సైబర్ పోలీసులు

image

వివిధ ప్రాంతాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. వీరిలో 13 ట్రేడింగ్ ఫ్రాడ్స్, మిగతా వారిని డిజిటల్ అరెస్ట్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు వీరిని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా దాదాపు 49 కేసుల్లో బాధితులకు రూ.89.7 లక్షలను తిరిగి ఇప్పించారు.

News November 28, 2025

HYD: రాత్రికి రాత్రే ఊరు మారిపోదు బ్రో..

image

మా ఊరు గ్రేటర్‌లో విలీనమైంది. ఇక అభివృద్ధి పరుగులు పెడుతుందని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ‘అనేక గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు విలీనం అవుతున్నా, ప్రక్రియ పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది. ఆ తర్వాతే అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. రాత్రికి రాత్రే ఊరు దశ.. దిశ మారిపోదు. పస్తుతం ఉన్న మహానగరంలోనే సమస్యలున్నాయి. విలీనం తర్వాత కూడా ఉంటాయి’ అని శివారులో గుసగుసలు వినిపిస్తున్నాయి.

News November 28, 2025

HYD: విలీనానికి ముందు.. అసలు లెక్క తేలాలిగా?

image

జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీన ప్రక్రియ సంపూర్ణం కావాలంటే చాలా లెక్కలు తేలాల్సి ఉంది. ఆయా మున్సిపాలిటీల ఆస్తులు, అప్పులు, ఆదాయవ్యయాలు, కరెంటు, వాటర్ బిల్లులు, పెండింగ్ బిల్లులు, భూముల వివరాలు.. ఇలా ఒకటేమిటి అన్నీ తేలాలి. ముఖ్యంగా వివాద భూముల లెక్కలు తేలాలి. ఇక ఆస్తి పన్నులు ఎన్నున్నాయి. ఎంత రావాలి అనేది కూడా క్లియర్‌గా ఉండాలి. అంతేకాక ఉద్యోగుల వివరాలు.. ఇవన్నీ జీహెచ్ఎంసీకి సమర్పించాలి.