News February 13, 2025
అధికారులకు GHMC కమిషనర్ కీలక ఆదేశాలు

GHMCలోని అడిషనల్, జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులను సందర్శకులు కలిసేందుకు సా. 4 నుంచి 5 గం.ల మధ్య కార్యాలయంలో ఉండాల్సిందేనని GHMC కమిషనర్ ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని పనిదినాల్లో ప్రజల వేదనలు వినేందుకు, వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కార్యాలయంలో ఉండాలన్నారు.ఒకవేళ ఎవరైనా అనివార్య కారణాలతో ఉండటం సాధ్యం కాకపోతే అడిషనల్ కమిషనర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News March 23, 2025
HYD: ‘నెట్ వర్కింగ్‌ను సద్వినియోగం చేసుకోండి’

యువత నెట్ వర్కింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఏఐ డేటా ఫెస్ట్ ప్రతినిధి, ప్రముఖ పారిశ్రామిక డేటా నిపుణులు ధావల్ పటేల్ సూచించారు. ఏఐ డేటా ఫెస్ట్ ఆధ్వర్యంలో శనివారం నారాయణగూడలో విద్యార్థులకు, యువతకు నెట్ వర్కింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏఐ డేటా సైన్స్ అనలిటిక్స్‌లో పురోగతులను పరిశోధించడానికి మంచి ఫ్లాట్ ఫారం లా ఇలాంటి వర్క్ షాపులు దోహద పడతాయన్నారు.
News March 22, 2025
చర్లపల్లి జైలులో ఖైదీలకు అవగాహన

ఖైదీలకు న్యాయసహాయంపై శనివారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జస్టిస్ బాల భాస్కరరావు, సెక్రటరీ జస్టిస్ కిరణ్‌కుమార్‌లు హాజరై ఖైదీలకు న్యాయసహాయం అవగాహన కల్పించారు. న్యాయ సహాయం కావాలంటే న్యాయసేవాధికార సంస్ధను సంప్రదించాలని సూచించారు.
News March 22, 2025
ఖైరతాబాద్: స్టాండింగ్ కమిటీ సభ్యుల సమావేశం

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం స్టాండింగ్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఇలాంబర్తి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. దీంట్లో భాగంగా ఇటీవల బడ్జెట్లో జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,101.21 కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నగరంలో చేపట్టాల్సిన అత్యవసర అభివృద్ధి పనులు, పరిష్కరించాల్సిన సమస్యలపై చర్చించారు.