News April 1, 2025
అధికారులకు NTR కలెక్టర్ ఆదేశాలు

ఏప్రిల్ 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 2,28,813 మందికి రూ. 98.11 కోట్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. సోమవారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి పంపిణీ ప్రారంభమవుతుందని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ జరపాలని సూచించారు.
Similar News
News December 2, 2025
ఏలూరు: ‘గృహ నిర్మాణానికి దరఖాస్తు పొడిగింపు’

ఏలూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో ఇంటి నిర్మాణ దరఖాస్తుకు గడువు పొడిగించడం జరిగిందని జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఆవాస్ ప్లస్ 2024 సర్వే పూర్తి చేయడానికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అదనంగా డిసెంబర్ 14వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించడం జరిగిందన్నారు. స్థలం ఉండి ఇల్లు లేని వారు, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 2, 2025
తిరుపతి: కోనలో ఇరుక్కుపోయిన భక్తులు

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని బత్తినయ్య కోనకు వెళ్లిన కొందరు భక్తులు చిక్కుకుపోయారు. బత్తినయ్య కోనలోని భక్తకంటేశ్వర స్వామి దర్శనానికి సోమవారం భక్తులు వెళ్లారు. ఇవాళ ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. భారీ వర్షాలతో కోనకు సమీపంలోని వాగుకు వరద పోటెత్తింది. అటవీ ప్రాంతం నుంచి వేరే దారి ఉన్నప్పటికీ స్థానికేతరులు కావడంతో చిక్కుకుపోయారు. ట్రాక్టర్, రోప్ తీసుకుని ఏర్పేడు అధికారులు ఘటన స్థలానికి బయల్దేరారు.
News December 2, 2025
ఏయూలో స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు నోటిఫికేషన్

ఏయూలో స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అధికారి టి.చిట్టిబాబు నోటిఫికేషన్ విడుదల చేశారు. 2010-11 సంవత్సరం నుంచి 2025 వరకు డిగ్రీ, పీజీ ప్రవేశం పొందిన విద్యార్థులు స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు అర్హులుగా ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 4 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.


