News December 10, 2024
అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం
వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ పథకాల అమలును వేగవంతం చేసి, ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక మొత్తంలో రైతులకు లబ్ధి చేకూర్చాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఎకరాలలో పామాయిల్ ప్లాంటేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.
Similar News
News February 5, 2025
హైదరాబాద్‌లో ఎవరి బలం ఎంత?
HYDలో ఎవరి బలం ఎంత ఉందో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. GHMC స్టాండిండ్ కమిటీ సభ్యుల్లో ఏ పార్టీకి ఎంత మంది ఓటేస్తారు అనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. INC 24, MIM 41, BJP 41, BRS 40 మంది ఉన్నారు. స్టాండింగ్ కమిటీ కోసం 15 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఏ పార్టీ నుంచి ఎంతమంది ఎన్నికవుతారో అనేది ఆసక్తిని రేపుతోంది.
News February 5, 2025
ఘట్కేసర్లో రైల్వే ట్రాక్‌పై సూసైడ్!
ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై మృతదేహం కలకలం రేపింది. మాధవరెడ్డి ఫ్లైఓవర్ వద్ద రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసుల వివరాలు.. నిన్న రాత్రి కాగజ్‌నగర్ నుంచి బీదర్ వెళుతున్న రైలు కింద పడి వ్యక్తి చనిపోయాడు. తల మీదుగా ట్రైన్ వెళ్లడంతో ముఖం ఛిద్రమైంది. ఇది గమనించిన ట్రైన్ కో పైలెట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 5, 2025
GHMCలో ఎలక్షన్స్.. నోటిఫికేషన్ విడుదల
GHMCలో స్టాండింగ్ కమిటీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కమిషనర్ ఇలంబర్తి షెడ్యూల్ విడుదల చేశారు. ప్రస్తుత 146 మంది కార్పొరేటర్లలో 15 మంది సభ్యులను ఎన్నుకోవాలి. GHMC హెడ్ ఆఫీస్‌లో FEB 10 నుంచి 17 నామినేషన్లు స్వీకరిస్తారు. 18వ తేదీన పరిశీలన, తుదిజాబితా వెల్లడిస్తారు. 21న ఉపసంహరణ, 25న ఎన్నిక ఉంటుంది. అదే రోజు ఓటింగ్ ముగిశాక లెక్కింపు చేస్తారు. ఏ పార్టీ నుంచి ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా మారింది.