News March 15, 2025

అధికారులతో సమావేశం నిర్వహించిన మేయర్, కమిషనర్

image

బడ్జెట్ సమీక్షపై అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే సమావేశం నిర్వహించారు. 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బల్దియా బడ్జెట్ రూపకల్పనపై సమర్పించిన అంచనాలు సమీక్షించి అధికారులకు మేయర్, కమిషనర్ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Similar News

News March 1, 2026

జగిత్యాల: నేడే ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష

image

జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్‌లో అందించే ఐదు నెలల ఉచిత శిక్షణ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ నరేశ్ తెలిపారు. ఈరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జగిత్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ & పీజీ కాలేజీలో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్ టికెట్, ఆధార్ కార్డు, బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో హాజరుకావాలని సూచించారు.

News March 1, 2026

ములుగు: CG మావోయిస్టుల డంప్ స్వాధీనం

image

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో పోలీసులకు భారీ విజయంలభించింది. నక్సలైట్లు రెండు వేర్వేరు ప్రదేశాల్లో దాచిన డంప్‌లపై శనివారం దాడులు నిర్వహించి రూ.46,31,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండో డంప్‌లో భారీ ఆయుధాలు, కార్ట్రిడ్జ్‌లు, ఎలక్ట్రానిక్ సామగ్రి పట్టుబడ్డాయి. ఇప్పటివరకు భద్రతా దళాలు మొత్తం రూ.1.08 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

News March 1, 2026

వికారాబాద్ జిల్లాలో పెరిగిన యాసంగి సాగు

image

జిల్లాలో యాసంగి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలో సుమారుగా 3,34,627 మంది రైతులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా అత్యధికంగా రైతులు వరి పంటను పండిస్తున్నారు. జిల్లాలో ఇదివరకు సాధారణ సాగు 75,838 ఎకరాల్లో ఉండేది. ప్రస్తుతం 93,116 ఎకరాలర పెరిగింది. జిల్లాలో అన్ని పంటలు కలుపుకుని ప్రస్తుతం 1,45,241 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. దీన్నిబట్టి జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు.